జీనోమ్‌ఇండియా: భారత జన్యు భవిష్యత్తును ఆవిష్కరిస్తోంది

జీనోమ్‌ఇండియా కార్యక్రమం భారత జనాభాకు ప్రత్యేకమైన జన్యు సమాచారాన్ని డీకోడ్ చేయడంలో గణనీయంగా పురోగమించింది, ఇది వైద్య పరిశోధన మరియు ఆరోగ్య సంరక్షణ రంగాలకు గొప్ప అవకాశాలను అందిస్తోంది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 85 వర్గాల (32 గిరిజన మరియు 53 అగిరిజన) కి చెందిన 10,074 మంది ఆరోగ్యవంతమైన, సంబంధం లేని వ్యక్తులపై జనోటైపింగ్‌ నిర్వహించింది. సుమారు 20,000 రక్త నమూనాల్లోంచి 9,772 మందిపై పూర్తిజన్యు అనుక్రమణ (whole genome sequencing) చేయబడింది. ఇందులో 180 మిలియన్లకు పైగా జన్యు రకాల వివిధతలు (variants) కనుగొనబడ్డాయి, వాటిలో 130 మిలియన్లు ఆటోసోమ్స్‌లో (లింగానికి సంబంధించినవి కానివి) మరియు 50 మిలియన్లు లింగ క్రోమోసోమ్స్‌లో ఉన్నాయి. కొన్ని వ్యాధులతో సంబంధం కలిగినవిగా ఉంటే, మరికొన్ని అరుదైనవిగా లేదా భారత్‌కే ప్రత్యేకమైనవిగా ఉన్నాయ. ఈ ఫలితాలు భవిష్యత్‌లో మధుమేహం వంటి వ్యాధుల ముందస్తు నివారణ, అరుదైన వ్యాధుల నిర్వహణ, ఔషధాల ఆవిష్కరణ మరియు కృత్రిమ మేధ (AI) ఆధారిత వైద్య విధానాల రూపకల్పనకు దారితీసే అవకాశం ఉంది.