విస్తారా ఈరోజు తన చివరి ప్రయాణాన్ని పూర్తి చేసుకుంటూ, తన వారసత్వం విస్తరించిన ఎయిర్ ఇండియాకు ఒక ప్రామాణికంగా నిలిచింది.

దశాబ్దం పాటు కార్యకలాపాలు నిర్వహించిన విస్తారా, భారతదేశంలో ప్రముఖ పూర్తి సేవల విమానయాన సంస్థగా తన ఉత్పత్తి మరియు సేవా ప్రమాణాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. తక్కువ ఖర్చుతో సేవలందించే విమానయాన సంస్థల మోజులో విస్తారా తన ప్రత్యేకతను చాటుకుంది.

విస్తారా చివరి విమాన ప్రయాణం నిర్వహించబోతోంది. మంగళవారం టాటా గ్రూప్‌ మేగా విమానయాన సంస్థ అయిన ఎయిర్ ఇండియాలో ఇది విలీనం కానుంది.

భారతీయ ప్రయాణికుల మనసులో ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవడంలో సఫలమైనదని చెప్పడం అతిశయోక్తి కాదేమో. సోషల్ మీడియాలో ప్రయాణికులు వ్యక్తం చేస్తున్న భావోద్వేగాలను చూస్తే అది స్పష్టంగా తెలుస్తోంది.

టాటా గ్రూప్ ప్రభుత్వ నుండి ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన తర్వాత విస్తారాతో విలీన ప్రక్రియ ప్రారంభమైంది. విస్తారాలో 49 శాతం వాటాను కలిగి ఉన్న సింగపూర్ ఎయిర్‌లైన్స్, విలీనానికి తరువాత ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటాను కలిగి ఉంటుంది.